'కెప్టెన్ మిల్లర్' గా ధనుశ్ .. రిలీజ్ డేట్ ఖరారు!
- 'కెప్టెన్ మిల్లర్'గా కనిపించనున్న ధనుశ్
- ఆయన జోడీకట్టిన ప్రియాంక మోహన్
- 1930 - 40 మధ్య కాలంలో నడిచే కథ
- కీలకమైన పాత్రలో శివరాజ్ కుమార్
- డిసెంబర్ 15న థియేటర్లకు రానున్న సినిమా
మొదటి నుంచి కూడా ధనుశ్ తనదైన రూట్లో ముందుకు వెళుతున్నాడు. అప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన మరో ప్రయోగమే 'కెప్టెన్ మిల్లర్'. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, ఫస్టులుక్ పోస్టర్ తోనే అందరూ ఈ సినిమాను గురించి మాట్లాడుకునేలా చేశాడు. అలాంటి ఈ సినిమా రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితం ప్రకటించారు.
డిసెంబర్ 15వ తేదీన ఈ సినిమాను తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 1930 - 40 మధ్య కాలంలో ఈ కథ నడుస్తుంది. యాక్షన్ ప్రధానంగా నడిచే ఈ సినిమా, ధనుశ్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైందని అంటున్నారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శివరాజ్ కుమార్ .. సందీప్ కిషన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.