'మంగళవారం' టీమ్ నుంచి అధికారిక ప్రకటన .. రిలీజ్ డేట్ ఇదే!
- అజయ్ భూపతి రూపొందించిన 'మంగళవారం'
- సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- ప్రధానమైన పాత్రలలో పాయల్ - నందిత శ్వేత
- నవంబర్ 17వ తేదీన సినిమా విడుదల
ఇది సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. గ్రామీణ నేపథ్యంలో 1980-90ల మధ్య కాలంలో ఈ కథ నడుస్తుంది. అందుకు తగిన వాతావరణం స్క్రీన్ పై కనిపించడానికి అజయ్ భూపతి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన టేకింగ్ తో పాటు అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు.
ఫస్టు పోస్టర్ వదిలిన దగ్గర నుంచి ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. నందిత శ్వేత .. అజయ్ ఘోష్ .. అజ్మల్ .. దివ్య పిళ్లై ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.