ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల!
- హను రాఘవపూడి తర్వాతి సినిమాలో హీరోగా ప్రభాస్!
- సీతారామంతో భారీ హిట్ అందుకున్న హను
- తెలుగులో బిజీగా శ్రీలీల
ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ‘సీతా రామం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి రెబల్ స్టార్ ప్రభాస్‌కు కథ వినిపించాడని, అది ప్రభాస్‌కు నచ్చిందని టాలీవుడ్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశం ఉంది. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ఆఫర్ శ్రీలీల చేతికి వస్తే ఆమె కెరీర్ మరో మెట్టుకు ఎక్కనుంది. ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.