రాజమండ్రి జైల్లో సత్యనారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన నందమూరి రామకృష్ణ
- 19 ఏళ్ల కుర్రాడు చనిపోవడంపై అధికారులు మూడు రకాల వాదనలు వినిపించారన్న రామకృష్ణ
- సత్యనారాయణ కుటుంబసభ్యులకు అండగా ఉంటామని వెల్లడి
- చంద్రబాబు ఇదే జైల్లో ఉండటం తమకు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్య
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...19 ఏళ్ల కుర్రాడు సత్యనారాయణ చనిపోవడంపై అధికారులు మూడు రకాల వాదనలు వినిపిస్తున్నారన్నారు. తొలుత టైఫాయిడ్ అన్నారని, ఇప్పుడు డెంగ్యూ అంటున్నారన్నారు. అతని కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామన్నారు. చంద్రబాబు జైల్లో ఇబ్బందికరంగా ఉన్నారని తన సోదరి భువనేశ్వరి చెప్పారన్నారు.