చంద్రబాబు గురించి కేశినేని నాని నుంచి ఆరా తీసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
- పార్లమెంట్ ఆవరణలో గడ్కరీకి ఎదురుపడిన కేశినేని నాని
- చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపిన టీడీపీ ఎంపీ
- చంద్రబాబు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని, మచ్చలేని నాయకుడని తనతో అన్నారని వెల్లడి
ఈ రోజు పార్లమెంటు ఆవరణలో ఎదురుపడి చంద్రబాబు యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆయన ఒక్క గొప్ప నాయకుడని, ఎటువంటి తప్పు చేసే వ్యక్తి కాదని మచ్చలేని ప్రజా సేవకుడని, భగవంతుని ఆశీస్సులతో అన్ని విఘ్నాలు తొలగించుకొని కడిగిన ముత్యంలాగ బయటపడతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.