తప్పు చేయడం చంద్రబాబు డీఎన్ఏలోనే లేదు: వర్ల రామయ్య
- స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై వెబ్ సైట్ తీసుకువచ్చిన టీడీపీ
- ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వర్ల రామయ్య
- చంద్రబాబును చేయని తప్పుకు జైలుకు పంపారని ఆవేదన
- వెబ్ సైట్ లో వాస్తవాలు ప్రజలంతా తెలుసుకోవాలని విజ్ఞప్తి
టీడీపీ ఆవిష్కరించిన వెబ్ సైట్ లోని వివరాలు పరిశీలిస్తే ఆయన ఏ తప్పు చేయలేదని, ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రే కావాలని కుట్రతో ఆయనపై అభియోగాలు మోపి జైలుకు పంపారని అర్థమవుతుందని అన్నారు.
వెబ్ సైట్ లోని సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకొని, తెలియనివారికి కూడా తెలియజేయాలని కోరుతున్నామని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. తప్పులు, నేరాలు అన్నీ ఈ ముఖ్యమంత్రి చేసి, ప్రజలకోసం పోరాడేవారిని వేధిస్తూ ఆనందిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.