బిగ్ బాస్ 7: న్యాయం కావాలంటూ ఏడ్చేసిన ప్రిన్స్.. వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

బిగ్ బాస్ 7: న్యాయం కావాలంటూ ఏడ్చేసిన ప్రిన్స్.. వీడియో ఇదిగో!

Big boss latest Promo video
  • మాయాస్త్ర టాస్క్ లో గౌతమ్ తో గొడవ
  • తప్పుడు కారణాలతో తనను టార్గెట్ చేస్తున్నారన్న ప్రిన్స్
  • ప్రిన్స్ ను ఓదార్చిన అమర్
బిగ్ బాస్ 7వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో మాయాస్త్ర టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తిచేసే క్రమంలో ప్రిన్స్ కు, గౌతమ్ కు మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది. స్టార్ మా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో గౌతమ్, ప్రిన్స్ కొట్టుకున్నంత పనిచేశారు. మాయాస్త్ర టాస్క్ లో భాగంగా ఈ గొడవ నెలకొంది. హౌస్ లో ఉండేందుకు ఎవరు అనర్హులో చెప్పి, వారిదగ్గర ఉన్న అస్త్రాన్ని అదే టీంలోని అర్హులకు ఇవ్వాలని గౌతమ్ కు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. దీంతో ప్రిన్స్ దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని తీసుకుని శివాజీకి ఇస్తానని గౌతమ్ చెప్పాడు.

దీనికి గౌతమ్ చెప్పిన కారణం సరిగా లేదని ప్రిన్స్ ఆరోపించాడు. ఇది కాస్తా ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసింది. ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. ఆ తర్వాత తనకు న్యాయం కావాలంటూ ప్రిన్స్ కెమెరా ముందు ఏడ్చేశాడు. తనను టార్గెట్ చేశారని వాపోతున్న ప్రిన్స్ ను అమర్ ఓదార్చడం ప్రోమోలో కనిపించింది. ఇంతమందిని ఏడిపించి ఏం బాగుపడతారంటూ మహాబలి టీమ్ పై అమర్ విరుచుకుపడ్డాడు.

తాజా ప్రోమో వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రిన్స్ కు మద్దతుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నిజాయతీగా ఆడుతున్నాడని, కష్టపడే మనస్తత్వమని ప్రిన్స్ ను మెచ్చుకుంటున్నారు. పల్లవి ప్రశాంత్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ప్రశాంత్ రైతుబిడ్డ అని పదే పదే చెప్పుకుంటున్నాడని బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ తప్పుబట్టారని గుర్తుచేశారు. అయితే, గౌతమ్ పదే పదే తానో డాక్టర్ ను అంటున్నా ఎవ్వరూ అభ్యంతరం చెప్పడంలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Advertisement
Big boss 7
Big boss promo
Prince yapar
Goutam
Bigboss

More Telugu News