ఏకంగా 11 భాషల్లో భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఫ్రీగా చూపించనున్న జియో సినిమా
- ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్
- జియో సినిమాలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం
- 2023-2028 వరకు భారత్ లో జరిగే మ్యాచ్ ల ప్రసార హక్కులు కొన్న వయాకామ్18
భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రసారంతో ఐదేళ్ల కాలానికి ఈ హక్కులు మొదలవుతాయి. దాంతో, ఐపీఎల్ తరహాలో ఈ సిరీస్‌ను అందరికీ ఉచితంగా ప్రసారం చేయాలని జియో నిర్ణయించింది . మొత్తం 11 భాషల్లో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పించనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, భోజ్‌పురి, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో ఈ మ్యాచ్‌లను జియో సినిమా ప్రసారం చేయనుంది.