చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకపోయారు: నందమూరి రామకృష్ణ
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్రులో టీడీపీ నేతల నిరసన దీక్ష
- హాజరైన నందమూరి రామకృష్ణ
నాడు యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి కుంభకోణం జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు విజన్ స్కిల్ డెవలప్ మెంట్ అయితే... జగన్ విజన్ కిల్ డెవలప్ మెంట్ అని నందమూరి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అరాచకాలను ప్రజలతో కలిసి ఎదుర్కొంటామని అన్నారు.