బీజేపీలో చీకోటి ప్రవీణ్ చేరిక వాయిదా!

Chikoti Praveen joining in BJP postponed
  • అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో బీజేపీ కార్యాలయానికి చీకోటి
  • అంతకుముందే కార్యాలయం నుండి వెళ్లిపోయిన పార్టీ అధ్యక్షుడు
  • వేచిచూసి వెనుదిరిగిన చీకోటి ప్రవీణ్, అనుచరులు
క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరిక వాయిదాపడింది. ఈ రోజు చీకోటి కమలం గూటికి చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తన అనుచరులతో కలిసి సంతోష్ నగర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. అయితే చీకోటి రాకకముందే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కిషన్ రెడ్డి రాకకోసం చాలాసేపు వేచి చూశారు. దీంతో చీకోటి అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతసేపటికీ రాకపోయేసరికి చీకోటి బీజేపీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరని, పార్టీ పెద్దలతో భేటీ తర్వాత కార్యాచరణను ప్రకటిస్తానని చీకోటి చెప్పారు.
Advertisement
chikoti praveen
BJP
Telangana
G. Kishan Reddy

More Telugu News