కరీనా కపూర్ ఫస్టు వెబ్ సిరీస్ గా 'జానే జాన్' .. నెట్ ఫ్లిక్స్ కి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్!
Add ap7am to your home Screen

కరీనా కపూర్ ఫస్టు వెబ్ సిరీస్ గా 'జానే జాన్' .. నెట్ ఫ్లిక్స్ కి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్!

Jaane Jaan web series update
  • వెబ్ సిరీస్ ల దిశగా కరీనా కపూర్ 
  • ఆమె ఫస్టు సిరీస్ గా 'జానే జాన్'
  • ముఖ్య పాత్రల్లో విజయ్ వర్మ - జైదీప్ అహ్లావత్ 
  • ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్
బాలీవుడ్ తెరను హీరోయిన్ గా కొంతకాలం పాటు కరీనా కపూర్ ఏలేసింది. వివాహమైన తరువాత సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చినప్పటికీ, ఆమె అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె వెబ్ సిరీస్ ల పై దృష్టి పెట్టడం విశేషం. తొలిసారిగా ఆమె హిందీలో ఒక భారీ వెబ్ సిరీస్ ను అంగీకరించింది. ఆ సిరీస్ పేరే 'జాన్ జాన్' .. నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నారు.  

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించాడు. కరీనా కపూర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, విజయ్ వర్మ - జైదీప్ అహ్లావత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఒంటరి జీవితాన్ని గడిపే ఒక స్త్రీ ... ఒక పోలీస్ ఆఫీసర్ .. ఒక ఉపాధ్యాయుడు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

మాయ అనే ఒక స్త్రీ కొన్ని కారణాల వలన తన భర్తను హత్య చేస్తుంది. ఆ రహస్యాన్ని దాచిపెట్టడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా? అనే ఆసక్తికరమైన అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
Advertisement
Kareena Kapoor
Vijay Varma
Jaideep Ahlavath

More Telugu News