Elon Musk: గ్రిమ్స్ తో ఎలాన్ మస్క్ కు రహస్యంగా మూడో సంతానం

Elon Musk and Grimes had 3rd child
షార్ట్స్‌లో చూడండి
టెస్లా సీఈవో, ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఆయన ఎక్స్ పార్ట్ నర్ గ్రిమ్స్ తమకు మూడో సంతానం ఉన్నట్టు వెల్లడించారు. వాస్తవానికి వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నట్టు ఇప్పటి వరకు ప్రపంచానికి తెలుసు. తాజాగా తమ మూడో సీక్రెట్ సంతానం గురించి ఇప్పుడు వెల్లడించారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఎలాన్ మస్క్ బయోగ్రఫీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. 

ఇందులో మస్క్, గ్రిమ్స్ వారి మూడో సంతానాన్ని చూపెట్టారు. మూడో సంతానమైన కొడుకు పేరు టెక్నో మెకానికస్ అని చెప్పారు. అయితే అతని గురించి అంతకు మించి వివరాలు తెలియలేదు. ఎప్పుడు పుట్టాడు? తదితర వివరాలు ఎవరికీ తెలియదు. ముగ్గురు మహిళలతో మస్క్ కు 10 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు భార్యలు (జస్టిన్ విల్సన్, తలులా రిలే) కాగా... గ్రిమ్స్ తో ఆయన మూడేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు.
Go Back to Shorts
Elon Musk
Grimes
Third Child

More Telugu News