Advertisement

అప్పుడు వైఎస్సార్ చేసిన పని ఇప్పుడు జగన్ చేస్తున్నాడు.. జగన్ పతనం ప్రారంభమయింది: కొనకళ్ల నారాయణ

Jagans fall started says Konakalla Narayana
  • జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారన్న కొనకళ్ల
  • జగన్ చేతిలో పోలీసు అధికారులు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శ
  • సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని మండిపాటు
వైసీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు పని చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. జగన్ చేతిలో పోలీసు అధికారులు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని మండిపడ్డారు. చంద్రబాబుపై గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసులు పెట్టారని... ఇప్పుడు ఆయన కొడుకు జగన్ కేసులు పెడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తో జగన్ పతనం ప్రారంభమయిందని చెప్పారు. జగన్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని చెప్పారు. ఇతర పార్టీల నేతలను కూడా అరెస్ట్ చేయించి జగన్ పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. కొనకళ్లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Advertisement
Konakalla Narayana
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News