తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌‌.. ఇవిగో ఫొటోలు!
Add ap7am to your home Screen

తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌‌.. ఇవిగో ఫొటోలు!

actress janhvi kapoor visits tirumala temple
  • వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్న జాన్వీ
  • స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసిన అధికారులు
  • లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించిన జాన్వీ కపూర్
తిరుమల వెంకటేశ్వరుడిని శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకుంది. ఈ రోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు జాహ్నవికి స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చిన జాన్వీ.. అచ్చ తెలుగు అమ్మాయిలానే కనిపించింది. జాన్వీ తిరుమలకు తరచూ వస్తుంటుంది. అప్పుడప్పుడు అలిపిరి మార్గంలో మెట్లు ఎక్కి వస్తుంటుంది.


Advertisement
Janhvi kapoor
Tirumala
Bollywood
TTD

More Telugu News