బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు
- ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులపాటు వానలే
- తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
- ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని మేడ్చల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.