నీ మాటలు నా హృదయాన్ని తాకాయి కల్యాణ్ బాబూ!: చిరంజీవి
- ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు
- ఒకరోజు ముందే శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- ముగ్ధుడైన చిరంజీవి
- నా ప్రియాతి ప్రియమైన తమ్ముడికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్
మీకు కోట్లాది మంది అభిమానులున్నా మీలో ఏ మాత్రం గర్వం లేదు... అందుకు కారణం మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానమే అంటూ అన్నయ్యను కీర్తించారు. మీ జీవన ప్రస్థానం చూస్తుంటే... ఒక సన్నని వాగు క్రమంగా ఎదుగుతూ మహానదిగా మారినట్టు అనిపిస్తుంది అని అభివర్ణించారు.
కాగా, తన తమ్ముడు పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేయడంపై చిరంజీవి స్పందించారు. "నా ప్రియాతి ప్రియమైన తమ్ముడికి కృతజ్ఞతలు. నీ మాటలు నా హృదయాన్ని తాకాయి కల్యాణ్ బాబూ!" అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ట్విట్టర్ లో విపరీతమైన స్పందన లభిస్తోంది.