నేడు ఐర్లాండ్‌తో భారత్ రెండో టీ20.. వాతావరణం ఎలా ఉందంటే?
- జోరుమీదున్న బుమ్రాసేన
- రాత్రి 7.30 నుంచి డబ్లిన్‌లో మ్యాచ్
- తొలి పోరుకు అంతరాయం కలిగించిన వర్షం
మరోవైపు సోమవారం ఆసియా కప్‌కు భారత జట్టును ఎంపిక చేయనుండగా తమ ఆటతో సెలెక్టర్లను మెప్పించ్చేందుకు భారత కుర్రాళ్లకు ఇది సువర్ణావకాశం కానుంది. యశస్వి, రుతురాజ్, తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ కు ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి పోరులోనే ఆడిన తుది జట్టును కొనసాగించే అవకాశం ఉంది.