తనకు టీడీపీ పాలనే నచ్చిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందన
Add ap7am to your home Screen

తనకు టీడీపీ పాలనే నచ్చిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందన

Botsa reacts to Pawan Kalyan comments
  • వైసీపీ పాలన కంటే టీడీపీ పాలన భేష్ అంటూ పవన్ వ్యాఖ్యలు
  • సెలెబ్రిటీ అంటూ పవన్ పై ధ్వజమెత్తిన బొత్స
  • పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యలు
  • ఉగాది తర్వాత సెలెబ్రిటీ పరిస్థితి క్లోజ్ అని వెల్లడి
  • అరుపులు, కేకలు ఈ ఆర్నెల్లేనని వ్యంగ్యం
వైసీపీ పాలనతో పోల్చితే తనకు టీడీపీ పాలనే నచ్చిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొనడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఓ సెలెబ్రిటీ రాష్ట్రమంతా తిరుగుతూ మా సీఎంపై అసహనం ప్రదర్శిస్తున్నారు అంటూ పవన్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఆ సెలెబ్రిటీకి టీడీపీ పాలన నచ్చిందట... పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నది మరోసారి నిరూపితమైంది అని ఎద్దేవా చేశారు. 

"టీడీపీ హయాంలో దోపిడీ, పెత్తందారీ వ్యవస్థ ఆ సెలెబ్రిటీకి కనిపించలేదా? రుషికొండలో జరుగుతోంది ప్రభుత్వ భవనాల నిర్మాణం... పైగా ఆ నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లోనే జరుగుతున్నాయి... నీకెందుకు నొప్పి? అందుకే ప్రజలు నిన్ను ఆమోదించడంలేదు" అని బొత్స వ్యాఖ్యానించారు. 

వైసీపీ సర్కారును గద్దె దించాలని సెలెబ్రిటీ అంటున్నారని... ఎందుకు గద్దె దించాలని అంటున్నారో, దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో కూడా ఆ సెలెబ్రిటీ చెబితే బాగుంటుందని బొత్స అన్నారు. ఉగాది తర్వాత సెలెబ్రిటీ పరిస్థితి ముగుస్తుందని, ఈ ఆర్నెల్లు వినిపించే అరుపులు, కేకలు ఆ తర్వాత ఉండవని వ్యంగ్యం ప్రదర్శించారు.
Advertisement
Botsa Satyanarayana
Pawan Kalyan
YSRCP
Janasena
TDP

More Telugu News