రిలీజ్‌కు ముందే రికార్డు కొట్టేసిన బాలయ్య ‘భగవంత్ కేసరి’
- సినిమా వరల్డ్ వైడ్ థియెట్రికల్ రైట్స్‌కు రూ. 75 కోట్లు!
- బాలయ్య సినిమా రైట్స్‌కు ఇదే అత్యధిక ధర
- 73 కోట్లతో వీరసింహారెడ్డి రికార్డు బ్రేక్
దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ కు చాలా సమయం ఉండగానే ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధికంగా రూ. 75 కోట్లకు వరల్డ్ వైడ్ థియెట్రికల్ రైట్స్ ను విక్రయించినట్టు టాలీవుడ్ సమాచారం. బాలయ్య గత చిత్రం వీరసింహారెడ్డి రైట్స్ అత్యధికంగా రూ.73 కోట్లకు అమ్ముడవగా ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ అయింది. కాగా, ఈ చిత్రం అమెరికా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ సినిమాస్ కొనుగోలు చేసింది. అక్టోబర్ 18న యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శిస్తారు.