రామ్‌చరణ్ రిలీజ్ చేసిన బెదురులంక ట్రైలర్.. శివ శంకర వరప్రసాద్ పాత్రలో కార్తికేయ
- కార్తికేయ, నేహాశెట్టి జంటగా వస్తున్న సినిమా
- కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో ఆసక్తిపెంచిన ట్రైలర్
- ఈ నెల 25న విడుదల కానున్న చిత్రం
యుగాంతం పుకార్ల నేపథ్యంలో కొందరు మోసగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని, భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో దోపిడీ చేస్తుంటారు. వాళ్ళ మాటలు నమ్మని హీరో ఏం చేశాడు? అన్నది మిగతా కథ అని తెలుస్తోంది. చిత్రంలో హీరోని ప్రేమించే అమ్మాయిగా హీరోయిన్ నేహా శెట్టి కనిపించింది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, 'వెన్నెల' కిశోర్, సత్య, రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.