ఆదాయం రూ. 7,606 కోట్లు.. పన్ను 1,159 కోట్లు.. బీసీసీఐనా మజాకా!
- 2021–22 ఆర్థిక సంవత్సరంలో 7,606 కోట్లు అర్జించిన భారత క్రికెట్ బోర్డు
- బోర్డు చేసిన ఖర్చు 3,064 కోట్లు
- అంతకుముందు ఏడాది కంటే 37 శాతం అధిక పన్ను కట్టిన బోర్డు
ఈ మేరకు రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇక, 2021–22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐకి రూ. 7,606 కోట్ల ఆదాయం లభించింది. అందులో 3,064 కోట్లను బోర్డు ఖర్చు చేసింది. 2020-21లో 4,735 కోట్ల ఆదాయం సమకూరగా అందులో 3,080 కోట్లు వివిధ పనుల కోసం ఖర్చయ్యాయి. కాగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.596.63 కోట్ల రూపాయలుగా ఉన్న బోర్డు ఆదాయపు పన్ను ఐదేళ్లలోనే రెట్టింపు కావడం విశేషం.