అన్నయ్యకి కోపం వస్తే అలా ఉంటుంది: 'భోళాశంకర్' ఈవెంటులో డైరెక్టర్ బాబీ

Bhola Shankar movie pre release event
  • ఈ నెల 11న రిలీజ్ కానున్న 'భోళాశంకర్'
  • శిల్పకళావేదికలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • చిరంజీవి ఆవేశం గురించి ప్రస్తావించిన బాబీ 
  • తన తమ్ముళ్లను ఎవరేమన్నా అన్నయ్య ఒప్పుకోరని వ్యాఖ్య

చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాంటి ఒక మాస్ ఇమేజ్ కి తగిన విధంగా ఆయన చేసిన సినిమానే 'భోళాశంకర్'. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ 'శిల్పకళా వేదిక'లో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి దర్శకులు బాబీ .. గోపీచంద్ మలినేని .. వంశీ పైడిపల్లి .. బుచ్చిబాబు .. సంపత్ నంది హాజరయ్యారు. 

ఈ స్టేజ్ పై బాబీ మాట్లాడుతూ .. " మెగా అన్నయ్యకి ఆవేశం రాదని చాలామంది అంటున్నారు. కానీ ఆయనకి ఆవేశం వస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో నాకు తెలుసు. ఒకసారి పవన్ కల్యాణ్ గారి ఒక సినిమా షూటింగు ఒక ప్రైవేట్ హౌస్ లో జరుగుతోంది. అక్కడ పనిచేస్తున్న కుర్రాళ్లు చెప్పులు వేసుకుని తిరుగుతున్నారని ఆ ఇంటి ఓనర్ ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం మొదలుపెట్టాడు. దాంతో కల్యాణ్ గారికి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ విషయం తెలిసి ఆ ఇంటి ఓనర్ కి చిరంజీవి గారు కాల్ చేశారు. "నా తమ్ముడిని బయటికి వెళ్లమనడానికి నువ్వెవడివిరా .. నీ ఇల్లెంతా? సినిమా షూటింగు ఎలా జరుగుతుందో తెలిసే కదా ఇచ్చావు. ఇంటిమీద ప్రేమ ఉంటే తాళం వేసుకో. అంతేగానీ .. డబ్బులు తీసుకుని షూటింగుకి ఇచ్చి ఇలా మాట్లాడటం కరెక్టు కాదు .. విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. కాస్త ముందు తెలిసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది" అంటూ వార్నింగ్ ఇచ్చారు. తనని ఏమన్నా అన్నయ్య పట్టించుకోరుగానీ, తన తమ్ముడిని .. తమ్ముళ్ల వంటి అభిమానులను ఎవరేమన్నా ఒప్పుకోరు" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Bobby
Chiranjeevi
Thamannah
Keerthi Suresh
Bhola Shankar

More Telugu News