చరిత్ర సృష్టించిన తెలుగు ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ
- ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ లో భారత్ కు తొలి స్వర్ణం అందించిన జ్యోతి సురేఖ జట్టు
- కాంపౌండ్ మహిళల విభాగంలో విజేతగా భారత్
- ఫైనల్లో మెక్సికో జట్టుపై ఘన విజయం
దీంతో 1981 నుంచి ఈ టోర్నీలో ఆడుతున్న భారత్ కు తొలిసారి స్వర్ణ పతకం లభించింది. ఇదివరకు పోటీ పడ్డ 11 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ 9 రజతాలు, 2 కాంస్యాలు సాధించింది. తాజా స్వర్ణంతో పతకాల సంఖ్య 12కి చేరింది. ఇందులో ఏడు తెలుగమ్మాయి జ్యోతి సురేఖ సాధించినవే కావడం మరో విశేషం. ఈ రోజు జరిగే కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలోనూ జ్యోతి సురేఖ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.