సుప్రీంలో ఊరట లభించిన నేపథ్యంలో.. లాలూను కలిసిన రాహుల్ గాంధీ!
- రాహుల్ గాంధీకి జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే
- మీసా భారతి నివాసంలో నిన్న లాలూను కలిసిన రాహుల్
- భేటీలో పాల్గొన్న కేసీ వేణుగోపాల్, తేజస్వి యాదవ్
ఆర్జేడీ ఎంపీ, లాలూ కుమార్తె మీసా భారతి నివాసంలో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లాలూను రాహుల్ గాంధీ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. భేటీ సందర్భంగా పలు విషయాలపై వీరు చర్చించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
