ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
- 2019కి ముందు జరిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చెల్లవన్న ఏపీ ప్రభుత్వం
- ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు
- రిజర్వేషన్లకు లోబడి జరిగిన నియామకాలను ఎలా తొలగిస్తారన్న సుప్రీం ప్రశ్న
ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ప్రొఫెసర్ల తరపున సీనియర్ న్యాయవాది రాజగోపాల్ వాదిస్తూ... రిజర్వేషన్లకు లోబడే వీరి నియామకాలు జరిగాయని తెలిపారు. రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాత కూడా వీరిని ఎలా తొలగిస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్లను కొనసాగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది స్టేట్మెంట్ ను రికార్డు చేసుకుని ప్రొఫెసర్లను వెంటనే నియమించాలని కోర్టు ఆదేశించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై విచారణను వాయిదా వేసింది.