తప్పిపోయిన చిలుక.. పట్టిస్తే రూ. 10 వేల నజరానా!

MP man puts posters for his missing parrots giving Rs 10000 Reward for who finds
తప్పిపోయిన తన చిలుకను పట్టి ఇచ్చినా, ఆచూకీ తెలిపినా 10 వేల రూపాయల నజరానా ఇస్తానంటూ ఓ వ్యక్తి ఊరంతా పోస్టర్లు వేసి మరీ ప్రకటించాడు. అంతేకాదు, ఆటోలకు మైకులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాకు చెందిన దీపక్ సోనీ కుటుంబం ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న రామచిలుక ఓ రోజు ఎటో వెళ్లిపోయింది. గతంలో ఒకసారి ఇలాగే ఎగిరిపోయినా మళ్లీ దానంతట అదే వచ్చింది. 

ఈసారి రోజులు గడుస్తున్నా రాకపోవడంతో కలత చెందిన కుటుంబం దానిని వెతికి పట్టి ఇచ్చిన వారికి రూ. 10 వేల నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు దీపక్ సోనీ పోస్టర్లు ప్రింట్ చేయించి ఊరంతా అతికించాడు. ఆటోకు మైకు పెట్టి ప్రచారం చేస్తున్నాడు. ఆ చిలుకంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. చిలుక సరిగా ఎగరలేకపోతోందని, వీధి కుక్కలు దానికేమైనా హాని తలపెట్టాయేమోనని ఆందోళన చెందుతున్నాడు.
Go Back to Shorts
Parrot
Madhya Pradesh
Damoh

More Telugu News