సినీ నటుడు నరేశ్‌కు కోర్టులో డబుల్ రిలీఫ్
- రమ్య రఘుపతి రాకూడదంటూ న్యాయస్థానం ఆదేశాలు
- మళ్లీ-పెళ్లి సినిమా విషయంలోను నరేశ్‌కు ఊరట
- మూడో భార్య పిటిషన్‌ను కొట్టివేసిన బెంగళూరు కోర్టు
మరోవైపు, పవిత్ర లోకేశ్-నరేశ్ కలిసి తీసిన మళ్లీ పెళ్లి సినిమా తన వ్యక్తిగత జీవితాన్ని పోలి ఉందని, తనను ఈ సినిమాలో టార్గెట్ చేశారని ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని దావా వేశారు. అయితే ఈ కేసులోనూ బెంగళూరులోని సివిల్ కోర్టులో నరేశ్‌కు ఊరట లభించింది.
మళ్లీ పెళ్లి సినిమాపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మెరిట్ లేని కారణంగా రమ్య రఘుపతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సెన్సార్ బోర్డు చెప్పినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు పేర్కొంది. అలాగే సెన్సార్ బోర్డు ఒక చిత్రాన్ని కల్పితమని సర్టిఫై చేస్తే దాని విడుదలను ప్రయివేటు వ్యక్తులు అడ్డుకోలేరని కోర్టు స్పష్టం చేసింది.