మదనపల్లె మార్కెట్లోనే.. కిలో రూ.200 లకు చేరువైన టమాట ధర!
- మదనపల్లెలో చివరి దశకు వచ్చిన సీజన్
- బయటి ప్రాంతాల్లో తగ్గిన దిగుబడి
- డిమాండ్ పెరగడంతో రికార్డు ధరలు
శనివారం మదనపల్లె మార్కెట్ కు కేవలం 253 టన్నుల టమాటా సరుకు మాత్రమే వచ్చింది. సీజన్ చివరి దశ కావడంతో పాటు మదనపల్లె ప్రాంతంలో తప్ప బయట ప్రాంతాల్లో టమాటా దిగుబడి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో కొరత ఏర్పడిందని వ్యాపారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే టమాటాలకు డిమాండ్ పెరిగి, రికార్డు స్థాయిలో ధర పలుకుతోందని అధికారులు వివరించారు.