బాలీలో కోతితో ఫొటో దిగిన సమంత.. డ్యాన్స్ వీడియో వైరల్

Samantha pic with monkey in Bali
  • స్నేహితులతో కలిసి బాలి వెకేషన్ కు వెళ్లిన సమంత
  • ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తున్న సామ్
  • తాజాగా బాలీలో జూకి వెళ్లిన సమంత
సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సమంత బాలీలో ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి బాలీకి సామ్ వెళ్లింది. ఎప్పటికప్పుడు తన వెకేషన్ కు చెందిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా తన స్నేహితురాలితో కలిసి అక్కడి జూ పార్క్ కు వెళ్లింది. అక్కడున్న కోతిని పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది. 

ఈ ఫొటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సమంత సాహసాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి చికిత్స కోసం విదేశాలకు కూడా వెళ్లి వచ్చింది. ఈ ఏడాది గ్యాప్ లో మరోసారి అమెరికాకు వెళ్లి వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స చేయించుకోవాలని ఆమె భావిస్తోంది. 
Advertisement
Samantha
Bali
Tollywood
Bollywood

More Telugu News