శోభన ఇంట్లో పనిమనిషి దొంగతనం.. ఆమెనే తిరిగి పనిలో పెట్టుకున్న సినీ నటి!
- చెన్నైలోని తేనాంపేటలో తల్లితో కలిసి నివసిస్తున్న శోభన
- ఏడాది క్రితం విజయ అనే మహిళను పని మనిషిగా పెట్టుకున్న నటి
- గత మార్చి నుంచి జూన్ వరకు రూ. 41 వేలు కొట్టేసిన పనిమనిషి
విజయ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు డబ్బులు మాయం అవుతుండటం జరుగుతూ వచ్చింది. దీంతో శోభనకు అనుమానం వచ్చి తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శోభన ఫిర్యాదుతో విజయను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. పోలీసు విచారణలో డబ్బును తానే కొట్టేశానని విజయ ఒప్పుకుంది. గత మార్చి నుంచి జూన్ వరకు రూ. 41 వేలు చోరీ చేశానని పోలీసులకు తెలిపింది. పేదరికం కారణంగానే తాను ఈ తప్పు చేశానని, తనను మన్నించాలని శోభనను విజయ ప్రాధేయపడింది. ఆమె దీన స్థితికి కరిగిపోయిన శోభన... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుని, మళ్లీ తన ఇంట్లోనే పని చేయడానికి అనుమతించారు.