నీ వెనక మాఫియా ఉంటే .. నా వెనక దునియా ఉంది: 'భోళా శంకర్' ట్రైలర్ డైలాగ్

Bhola Shankar trailer released
  • 'భోళా శంకర్' గా కనిపించనున్న చిరంజీవి
  • సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా నడిచే కథ 
  • ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్
  • ఆగస్టు 11వ తేదీన సినిమా రిలీజ్
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ 'భోళా శంకర్' సినిమాను రూపొందించాడు. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ బాణీలను అందించాడు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, హీరో చెల్లెలి పాత్రను కీర్తి సురేశ్ పోషించింది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విలన్ స్థావరంలోకి హీరో ఎంట్రీ ఇచ్చే సీన్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలుస్తోంది. చిరంజీవి మాస్ డైలాగ్ డెలివరీ .. ఆయన స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రైలర్ చివర్లో పవన్ మేనరిజంను చిరూ అనుకరించడం కొసమెరుపు.

'నీ వెనుక మాఫియా ఉంటే నా వెనుక దునియా ఉంది' అంటూ రవిశంకర్ తో చిరూ చెప్పే డైలాగ్, చిరూను చూస్తూ .. 'రంగస్థలం'లో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు' అనే డైలాగ్ ఫ్యాన్స్ కి నచ్చుతాయి. వెన్నెల కిశోర్ పాత్ర ఒక రేంజ్ లో ఉంటుందనే విషయం అర్థమవుతోంది.
Go Back to Shorts
Chiranjeevi
Thamannah
Keerthi Suresh
Bhola Shankar

More Telugu News