ఆకివీడులో యువకుడి బరితెగింపు.. ఇంట్లోకి చొరబడి తాత, తల్లిపై దాడిచేసి యువతి కిడ్నాప్
- సిద్ధాపురం గ్రామంలో దారుణం
- నిద్రిస్తున్న తాతపై ఇనుప రాడ్డుతో దాడి
- తనతో రాకుంటే తాత, తల్లిని చంపేస్తానని హెచ్చరిక
- బైక్‌పై యువతిని బలవంతంగా తీసుకెళ్లిన నిందితుడు
- వృద్ధుడి పరిస్థితి విషమం
నిన్న తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లి బయట నిద్రిస్తున్న ఆమె తాత తలపై ఇనుపరాడ్డుతో మోదాడు. అతడి కేకలు విని బయటకు వచ్చిన అతడి కుమార్తెపైనా దాడిచేశాడు. తనతో రాకుంటే తాతను, తల్లిని చంపేస్తానని బెదిరించి యువతిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు, ఆమె కుమార్తె భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వృద్ధుడి తలకు 50 కుట్లు పడ్డాయని, అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.