Noida Man Crushed Rat: ఎలుకను తన బైక్‌ కింద తొక్కి చంపిన వ్యక్తి.. అతడిని అరెస్ట్ చేయడం వెనక కారణం చెప్పిన పోలీసులు

Khan Biryani Owner Kills Rodent by Running Bike Over It
  • నింతుడిని బిర్యానీ సెంటర్ యజమాని జైనుద్దీన్‌గా గుర్తింపు
  • అరెస్టుతో తగిన శాస్తి జరిగిందంటూ నెటిజన్ల ఆనందం
  • ఎలుకను చంపినందుకు అరెస్ట్ చేయలేదని వివరణ

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి ఓ ఎలుకను తన బైక్‌ కింద తొక్కి చంపిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎలుకను తన బైక్ చక్రాల కింద పదేపదే నలిపి చంపేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూగ జీవిపై ఇంత కర్కశత్వమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఎలుకను చంపింది ‘ఖాన్ బిర్యానీ’ సెంటర్ యజమాని జైనుద్దీన్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

ఎలుకను హింసించి చంపినందుకు భలే శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్లతో సంతోషం వ్యక్తం చేశారు. అతడిని అరెస్ట్ చేసిన విషయం కూడా వైరల్ అయింది. దీంతో స్పందించిన పోలీసులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎలుకను చంపినందుకు అతడిని అరెస్ట్ చేయలేదని, సెక్షన్ 151 కింద నమోదైన మరో కేసులో అతడిని అరెస్ట్ చేసినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News