Samantha: బాలీలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. వీడియో ఇదిగో!

Samantha enjoying in Bali
షార్ట్స్‌లో చూడండి
ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ సమంత కొత్త లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం బాలీ పర్యటనలో సామ్ ఎంజాయ్ చేస్తోంది. బాలీ బీచ్ వద్ద ఉన్న వీడియోను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. షార్ట్ హెయిర్ తో చిరునవ్వులు చిందిస్తూ వీడియోలో ఆమె కనిపించింది. తన స్నేహితులతో కలిసి ఆమె బాలీకి వెళ్లినట్టు తెలుస్తోంది. 

ఇటీవల ఆమె కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈషా ఫౌండేషన్ లో కొంత సమయాన్ని గడిపిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె మెడిటేషన్ చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికి వస్తే... విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన 'ఖుషి' చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ కూడా విడుదల కాబోతోంది. మరోవైపు కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోలేదు. ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్స్ ను కూడా నిర్మాతలకు వెనక్కి తిరిగి ఇచ్చేసింది.

.
Go Back to Shorts
Samantha
Tollywood
Bali

More Telugu News