ఇలా థియేటర్స్ కీ .. అలా నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి 'నాయకుడు'
Add ap7am to your home Screen

ఇలా థియేటర్స్ కీ .. అలా నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి 'నాయకుడు'

Nayakudu OTT release date confirmed
  • తమిళనాట జూన్ 29న విడుదలైన 'మామన్నన్'
  • ఉదయనిధి కెరియర్లోనే పెద్ద హిట్ 
  • తెలుగులో 'నాయకుడు' టైటిల్ తో ఈ నెల 14న రిలీజ్
  • ఇక్కడి థియేటర్ల నుంచి లేని రెస్పాన్స్ 
  • ఈ నెల 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ మధ్య కాలంలో తమిళనాట విడుదలైన సినిమాలలో కంటెంట్ పరంగా మంచి మార్కులను దక్కించుకున్న సినిమాలలో 'మామన్నన్' ఒకటిగా కనిపిస్తుంది. ఉదయనిధి స్టాలిన్ .. కీర్తి సురేశ్ .. వడివేలు .. ఫహాద్ ఫాజిల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, క్రితం నెల 29వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. 

మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 'నాయకుడు' టైటిల్ తో ఈ నెల 14వ తేదీన ఇక్కడి థియేటర్లకు వచ్చింది. సహజత్వానికి చాలా దగ్గరగా నడిచిన ఈ కథ తమిళనాట ప్రశంసలను అందుకోగా, తెలుగులో పబ్లిసిటీ కూడా పెద్దగా లేక డీలాపడిపోయింది. ఈ సినిమాను ఎవరూ కూడా అంతగా పట్టించుకోలేదు. 

అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి తమిళ .. తెలుగు .. మలయాళ ... కన్నడ భాషల్లో 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, పోస్టర్ ను కూడా వదిలారు. తెలుగు థియేటర్స్ కి వచ్చిన రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా పలకరించనుందన్న మాట. కంటెంట్ పరంగా చూసుకుంటే, ఓటీటీ ద్వారా కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
Udayanidhi
Keerthi Suresh
Vadivelu
Nayakudu

More Telugu News