ఏపీ మంత్రి రోజాకు "సారీ" చెప్పిన డెక్కన్ క్రానికల్ పత్రిక

Deccan Chronicle said Sorry to AP minister Roja
  • ఇటీవల పవన్ కల్యాణ్ ను సన్నీ లియోన్ తో పోల్చిన మంత్రి రోజా
  • రోజా వ్యాఖ్యలపై సన్నీ లియోన్ ఘాటు బదులిచ్చిందంటూ ప్రచారం
  • సన్నీ లియోన్ పేరిట వైరల్ అయిన ట్వీట్
  • ఇదే అంశంతో పత్రికల్లో కథనాలు
  • తమ కథనం పట్ల చింతిస్తున్నామన్న డెక్కన్ క్రానికల్
ఇటీవల ఏపీ మంత్రి రోజా జనసేనాని పవన్ కల్యాణ్ ను సన్నీ లియోన్ తో పోల్చడం తెలిసిందే. అయితే రోజా వ్యాఖ్యలపై సన్నీ లియోన్ తీవ్రస్థాయిలో స్పందించినట్టు ఓ పోస్టు ట్విట్టర్ లో వైరల్ అయింది. 

ఆ ట్విట్టర్ హ్యాండిల్ సన్నీ లియోన్ పేరుమీదే ఉన్నప్పటికీ, దానికి బ్లూ టిక్ లేదు. అది వెరిఫైడ్ హ్యాండిల్ కానప్పటికీ, సన్నీ లియోన్... రోజాకు ఘాటుగా బదులిచ్చిందంటూ ప్రచారం జరిగింది. పత్రికల్లోనూ దీనిపై కథనాలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో మంత్రి రోజాకు డెక్కన్ క్రానికల్ పత్రిక క్షమాపణ చెప్పింది. అది నిజమైన అకౌంటే అనుకుని పొరబడ్డామని డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ వెల్లడించారు. 

"సీనియర్ వైసీపీ నేత, ఏపీ మంత్రి రోజాపై ప్రచురించిన కథనం పట్ల చింతిస్తున్నాం. అది ప్యారడీ అకౌంట్ అని జాగ్రత్తగా గుర్తించలేకపోయాం. దాన్ని సరిగా చెక్ చేయలేకపోయాం. జరిగిన తప్పిదానికి నేను బాధ్యత వహిస్తున్నాను" అంటూ రెసిడెంట్ ఎడిటర్ ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Roja
Deccan Chronicle
Article
Sunny Leone
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News