శంకర్ తో చర్చలు జరుపుతున్న విజయ్!

Vijay in Shankar Movie
  • 'లియో' షూటింగులో బిజీగా విజయ్ 
  • నెక్స్ట్ డైరెక్టర్ గా లైన్లో ఉన్న వెంకట్ ప్రభు 
  • పొలిటికల్ టచ్ తో కూడిన కథపై విజయ్ దృష్టి 
  • దర్శకుడిగా శంకర్ ను రంగంలోకి దింపినట్టుగా టాక్
ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 'లియో' సినిమాను చేస్తున్నాడు. భారీ బడ్జెట్ లో .. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత వెంకట్ ప్రభుతో కలిసి విజయ్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ తరువాత ఆయన రాజకీయాలపైనే పూర్తి ఫోకల్ పెట్టనున్నారని చెబుతున్నారు. 

అయితే తాను రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు పొలిటికల్ టచ్ తో కూడిన కంటెంట్ తో ఒక సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి విజయ్ వచ్చాడని అంటున్నారు. ఈ తరహా భారీ సినిమాలను శంకర్ అయితే సరిగ్గా తెరకెక్కిస్తాడని భావించిన విజయ్, ఆయనను సంప్రదించినట్టుగా చెబుతున్నారు. 

ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని సమాచారం. ఇది విజయ్ కి 69వ సినిమాగా గానీ, 70వ సినిమాగా గాని ఉండొచ్చని అంటున్నారు. ఇక శంకర్ ఒక వైపున 'ఇండియన్ 2' .. మరో వైపున 'గేమ్ ఛేంజర్' ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి శంకర్ - విజయ్ కాంబోపైనే ఉందనేది మాత్రం వాస్తవం. 
Advertisement
Vijay
Venkat Prabhu
Shankar
Kollywood

More Telugu News