అభిమానులకు పండగే.. ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ కన్ఫామ్!
- రాజమౌళి దర్శకత్వంలో లేదంటే ఆయన పర్యవేక్షణలో
మరొకరు తీసే అవకాశం - మహేశ్ బాబుతో సినిమా పూర్తయ్యాక పట్టాలెక్కనున్న రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం
- దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టు ప్రముఖ కాలమిస్ట్ ట్వీట్
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ను రాజమౌళి డైరెక్ట్ చేస్తారని లేదంటే ఆయన పర్యవేక్షణలో మరొకరు దర్శకత్వం వహిస్తారని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నట్టు తెలిపారు. రాజమౌళి కలల ప్రాజెక్టు అయిన మహాభారతం కూడా వస్తుందన్నారు. మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోయే జంగిల్ అడ్వెంచర్ సినిమా పూర్తయిన వెంటనే మహాభారతం తెరకెక్కిస్తారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారని మనోబాల ట్విట్టర్ లో పేర్కొన్నారు.