నిర్మాతగా మారిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్

Kriti Sanon launches production house
  • బ్లూ బటర్‌‌ ఫ్లై పేరిట నిర్మాణ సంస్థ ప్రారంభం
  • తొలి ప్రాజెక్ట్‌గా ‘దో పట్టి’ సినిమా ప్రకటన
  • కాజోల్‌తో కలిసి నటించనున్న కృతి   
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చిత్ర పరిశ్రమ వాళ్లు పక్కాగా పాటిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో ముందుటారు. స్టార్ డమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. నేటి తారలు నటనకు తోడు పలు వ్యాపారాల్లోనూ అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలో అనుష్క శర్మ, కంగనా రనౌత్ వంటి హీరోయిన్లు నిర్మాతలుగా మారారు. తాజాగా కృతి సనన్ కూడా వారిలో బాటలో నడుస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఆదిపురుష్‌’ చిత్రంలో సీతగా కనిపించిన కృతి సనన్ ఓవైపు హీరోయిన్‌గా కొనసాగుతూనే నిర్మాతగానూ మారింది. 

తన చెల్లి నుపూర్ సనన్ తో కలిసి ‘బ్లూ బటర్‌‌ ఫ్లై ఫిల్మ్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రకటించింది. ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి మొదటి ప్రాజెక్ట్‌గా ‘దో పట్టి’ అనే సినిమా తెరకెక్కబోతోంది. నెట్‌ ఫ్లిక్స్ లో విడుదల కానున్న ఈ చిత్రం ఓ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గానూ నటిస్తోంది. సీనియర్ నటి కాజోల్‌ మరో కీలకపాత్రను పోషిస్తోంది. నిర్మాణ సంస్థను ప్రారంభించాలని తొమిదేళ్లుగా అనుకుంటున్నానని కృతి చెప్పింది. ఎట్టకేలకు తన కలలను సాకారం చేసుకుంటున్నానని తెలిపింది.
Go Back to Shorts
Kriti Sanon
Bollywood
production house

More Telugu News