ఇంగ్లండ్ ఫ్యాన్స్ అనుచిత ప్రవర్తన నేపథ్యంలో.. తమ కుటుంబాలకు అదనపు భద్రత కోరిన ఆసీస్ ఆటగాళ్లు!
- రెండో టెస్ట్‌లో ఆసీస్ ఆటగాళ్లకు చేదు అనుభవాలు
- వివాదాస్పదమైన బెయిర్ స్టో ఔట్
- లీడ్స్ మైదానంలో అదనపు భద్రత కోసం విజ్ఞప్తి
ఆస్ట్రేలియా ఆటగాళ్లు అదనపు భద్రత కావాలని అడిగారని, లార్డ్స్ లో ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ జట్టు సహాయక సిబ్బంది తనయుడి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, మరో ఆటగాడి తల్లి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయని యాషెస్ వర్గాలు తెలిపాయి. కాగా, ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో ఆసీస్ 2-0తో ముందంజలో ఉంది.