అభిమాని శ్యామ్ మృతిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన

Junior NTR response on Shyam death
  • అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్యామ్
  • శ్యామ్ మృతి అత్యంత బాధాకరమన్న ఎన్టీఆర్
  • అధికారులు తక్షణమే దర్యాప్తు జరపాలని విన్నపం
కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన మృతి చెందారు. తన కొడుకుది హత్య అని శ్యామ్ తండ్రి చెపుతుండగా... శ్యామ్ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు చెపుతున్నారు. ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరోవైపు ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని తారక్ అన్నారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. శ్యామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.  
Go Back to Shorts
Junior NTR
Shyam
Fan

More Telugu News