మామిడిపళ్ల కోసం తన్నుకున్న జనం.. పైగా లండన్ నగరంలో!
- లండన్‌లో మామిడి పండ్ల కోసం తన్నుకున్న జనం
- చేతికందిన వస్తువులతో దాడికి యత్నం
- నెట్టింట వీడియో వైరల్
- లండన్‌లో ఇలాంటి ఘటనలా అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ఈ వీడియోలో కొందరు మామిడి పళ్లు చేజిక్కించుకునే ప్రయత్నంలో ఒకరిపై మరొకరు దాడికి దిగారు. చేతికి అందిన వస్తువులతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ మహిళ కూడా తగ్గేదేలేదంటూ ఈ గొడవలోకి దిగింది. అవతలి వ్యక్తిని అమాంతం తోసేసింది. గొడవ జరుగుతున్న ప్రాంతంలో నేల తడిగా ఉండటంతో కొందరు జారి పడ్డారు కూడా.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. లండన్‌లో ఇది జరిగిందని తెలిసి మరింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ‘‘మామిడి పళ్ల కోసం ఇంతగా తన్నుకుంటున్నారంటే ఆ మహానగరాన్ని దేవుడే కాపాడాలి’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.