నితిన్ .. వక్కంతం మూవీ టైటిల్ మారిందట!

Nithin in Vakkantham Vamsi Movie Update
  • నితిన్ హీరోగా రూపొందుతున్న 'ఎగస్ట్రా'
  • 'జూనియర్' టైటిల్ ను పక్కన పెట్టేసిన మేకర్స్
  • దర్శకుడిగా వక్కంతం వంశీకి రెండో సినిమా 
  • కథానాయికగా అలరించనున్న శ్రీలీల
  • నిఖిల్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న సినిమా
నితిన్ ఒక వైపున వెంకీ కుడుములతోను .. మరో వైపున వక్కంతం వంశీతోను సినిమాలు చేస్తున్నాడు. గతంలో బన్నీతో 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా' సినిమా చేసిన వక్కంతం, చాలా గ్యాప్ తరువాత మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. కథా రచయితగా మంచి పేరున్న వంశీపై నమ్మకంతో నితిన్ ఛాన్స్ ఇచ్చాడు. 

నిఖిత రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ సినిమాలో నితిన్ జోడీగా శ్రీలీల కనిపించనుంది. ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే ఆ టైటిల్ అంత ఎఫెక్టివ్ గా అనిపించడం లేదని చెప్పి పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమాకి 'ఎగస్ట్రా' అనే టైటిల్ ను సెట్ చేశారట. ట్యాగ్ లైన్ గా 'ఆర్డినరీ మేన్' అనేది ఉంటుంది. అంటే మొత్తంగా చూసుకుంటే 'ఎక్స్ ట్రార్డినరీ మేన్'గా అనిపిస్తుందన్న మాట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి టైటిల్ కూడా డిఫరెంట్ గానే ఉండేలా ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు.

Go Back to Shorts
Nithin
Sreeleela
Vakkantham Vamsi

More Telugu News