‘ది కానిస్టేబుల్’ షూటింగ్‌లో గాయపడ్డ హీరో వరుణ్ సందేశ్

Vanun sandesh injured during the constable shooting
  • ఫైట్ సీన్లు తెరకెక్కిస్తున్న సమయంలో వరుణ్ కాలికి గాయాలు
  • మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
  • షూటింగ్ వాయిదా వేశామని దర్శకనిర్మాతల ప్రకటన
‘ది కానిస్టేబుల్’ చిత్రం షూటింగ్ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్‌ గాయాలపాలయ్యారు. మంగళవారం ఫైటింగ్ సీన్లు తెరకెక్కిస్తున్న సమయంలో ఆయన కాలికి బలమైన గాయాలయ్యాయని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వరుణ్ సందేశ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. వైద్యులు ఆయన కాలికి కట్టుకట్టి, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని చెప్పారు. దీంతో, ది కానిస్టేబుల్ షూటింగ్ వాయిదా వేశామని వెల్లడించారు. 

జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ జీవితమే కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్ 40 శాతం పూర్తయ్యిందని నిర్మాత బలగం జగదీశ్ తెలిపారు. వరుణ్ పూర్తిగా కోలుకున్నాక చిత్రీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 
Advertisement
Varun Sandesh

More Telugu News