'శేఖర్' తరువాత సైలెంటైన రాజశేఖర్ !
- రాజశేఖర్ నుంచి వచ్చిన 'శేఖర్'
- మలయాళం సినిమాకి ఇది రీమేక్
- థియేటర్లలో నిలబడలేకపోయిన సినిమా
- ఆయన నిర్ణయం తెలుసుకోవాలనే ఆసక్తితో ఫ్యాన్స్
అలాంటి రాజశేఖర్ 'శేఖర్' సినిమా నుంచి సైలెంట్ అయ్యారు. నిజానికి ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా వదిలారు. కానీ ఆ ప్రాజెక్టులేవీ సెట్స్ పై సందడి చేస్తున్న దాఖలాలైతే కనిపించడం లేదు.
'శేఖర్' సినిమా .. మలయాళంలో హిట్ కొట్టిన 'జోసెఫ్'కి రీమేక్. ఈ సినిమా రీమేక్ కి మంచి టాక్ వచ్చింది .. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా థియేటర్స్ లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. అప్పటి నుంచి రాజశేఖర్ సైలెంట్ కావడం కనిపిస్తోంది. ఆయన నిర్ణయమేమిటనేది తెలుసుకోవాలనే ఆసక్తితో అభిమానులు ఉన్నారు.