Uttar Pradesh: బాలుడి వింత ప్రవర్తన.. తాతయ్యే మళ్లీ పుట్టాడా..?

UP Kids strange behaviour sparks rumors of Granddad being reborn as kid
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాకు చెందిన ఓ బాలుడి ప్రవర్తన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. తన అమ్మమ్మే గతజన్మలో తన భార్య అని చెబుతున్న బాలుడు..తల్లి, మేనమామలు తన సంతానమని చెప్పుకొచ్చాడు. 

రతన్‌పూర్ గ్రామానికి చెందిన మనోజ్ మిశ్రా 2015 జనవరి 9న మరణించారు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన పాముకాటుకు గురై దుర్మరణం చెందారు. అప్పటికి మనోజ్ కుమార్తె రంజన గర్భంతో ఉంది. తండ్రి పోయిన 20 రోజులకు ఆమెకు కొడుకు పుట్టాడు. అతడికి ఆర్యన్ అని పేరు పెట్టారు. 

అయితే, జూన్ 15 నుంచి ఆర్యన్ వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆ రోజు అమ్మమ్మ ఇంట్లో ఉన్న అతడు తాను మనోజ్ అని చెప్పడం ప్రారంభించాడు. ఇది చూసిన బాలుడి మేనమామలు, అమ్మమ్మ కన్నీరుమున్నీరయ్యారు. ఇక బాలుడు తన పేరిట బ్యాంకులో డబ్బులు ఉన్నాయని కూడా చెప్పాడు. దీంతో, బాలుడి ప్రవర్తన స్థానికంగా చర్చనీయాంశమైంది. తాతయ్యే మళ్లీ బాలుడిగా పుట్టాడా? అంటూ జనాలు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Uttar Pradesh

More Telugu News