పిల్లల కోసం రెండో పెళ్లి.. 62 ఏళ్ల వయసులో ముగ్గురికి తండ్రైన వ్యక్తి

పిల్లల కోసం రెండో పెళ్లి.. 62 ఏళ్ల వయసులో ముగ్గురికి తండ్రైన వ్యక్తి

Man in 60s becomes father after second wife gives birth to triplets in Madhyapradesh
  • మధ్యప్రదేశ్‌‌లోని సత్నా జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • పిల్లల కోసం భర్తకు లేటువయసులో రెండో పెళ్లి చేసిన భార్య
  • పెళ్లయిన ఆరేళ్లకు రెండో భార్య ప్రసవం
  • ఒకేసారి ముగ్గురు పిల్లలు జన్మించడంతో కుటుంబంలో మిన్నంటిన సంబరం
పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్న ఓ పెద్దాయన 62 ఏళ్ల వయసులో ఏకంగా ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 

కుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహాకు ఇద్దరు భార్యలు. ఆయన కుమారుడు 18 ఏళ్ల వయసులో ఓ రోడ్డు  ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అయితే, గోవింద్‌కు మళ్లీ సంతానభాగ్యం కలిగించాలనే ఉద్దేశ్యంతో పెద్ద భార్య కస్తూరీబాయి ఆయనకు హిరాబాయితో(30) రెండో వివాహం జరిపించింది. ఆరేళ్ల క్రితం ఈ వివాహం జరగ్గా ఇన్నాళ్లకు వారి కోరిక తీరింది. హీరాబాయి తాజాగా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో మరోసారి సంతోషం వెల్లివిరిసింది.
Advertisement
Madhya Pradesh

More Telugu News