Allu Arjun: అదృష్టం అంటే శ్రీలీలదే.. అల్లు అర్జున్‌ సరసన అవకాశం

Sreeleela paired  with Allu Arjun for aha Original
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యువ నటి శ్రీలీలను అదృష్టం అస్సలు వదలడం లేదు. పెళ్లిసందD అనే చిన్న చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మాయి ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. హిట్స్, ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా అగ్ర దర్శకులు, నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోల సరసన ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా ఎనిమిది సినిమాలున్నాయి. 

 వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ఆదికేశవ విడుదలకు సిద్ధం అవగా.. బోయపాటి శ్రీను-పోతినేని రామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం, నితిన్ 32వ సినిమాలో, బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి, విజయ్ దేవరకొండ 12వ సినిమా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబు గుంటూరు కారం, ఓ కన్నడ సినిమాలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంది. ఇప్పుడు మరో భారీ ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. 

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ నిర్మిస్తున్న సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే చాన్స్ శ్రీలీల కొట్టేసింది. ఈ విషయాన్ని ఆమె పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. ఓ స్టెప్పులో బన్నీపైన ఆమె కూర్చున్న క్యూట్ పోస్టర్ ను సైతం విడుదల చేసింది. ఈ ఆహా ఒరిజినల్ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Allu Arjun
AHA
Sreeleela
aha Original
Trivikram Srinivas

More Telugu News