Varun Tej: లావణ్య త్రిపాఠీతో జాలీగా.. పిక్ పంచుకున్న వరుణ్ తేజ్

Varun Tej shares cool pic with Lavanya Tripathi
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల హైదరాబాదులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాలభామ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మెగా కుటుంబంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ కూల్ పిక్ ను పంచుకున్నాడు. తన మనసు దోచుకున్న లావణ్య త్రిపాఠీతో కలిసి ఫారెన్ లో విహరిస్తున్న వరుణ్ తేజ్ ను ఆ ఫొటోలో చూడొచ్చు. 

ఈ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో వరుణ్ తేజ్ స్పందిస్తూ... హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలోనూ వరుణ్ తేజ్ ప్రాజెక్టు చేస్తున్నాడు. 

ఇక, ఉత్తరాది బ్యూటీ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అథర్వతో ఓ తమిళ చిత్రం చేసేందుకు ఓకే చెప్పింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమయ్యే మరో చిత్రంలోనూ లావణ్య నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అటు, అన్నపూర్ణ స్టూడియోస్, హాట్ స్టార్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకునే వెబ్ సిరీస్ లోనూ నటించనుంది.
Go Back to Shorts
Varun Tej
Lavanya Tripathi
Engagement
Tollywood

More Telugu News