'దేవర' సినిమాలో ఆ ట్విస్ట్ అదిరిపోతుందట!
Add ap7am to your home Screen

'దేవర' సినిమాలో ఆ ట్విస్ట్ అదిరిపోతుందట!

Devara Movie Updatde
  • ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'దేవర'
  • ఇప్పటికే పూర్తయిన రెండు షెడ్యూల్స్ 
  • జాన్వీ పాత్ర వైపు నుంచి కొనసాగనున్న సస్పెన్స్ 
  • సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయి రిలీజ్ 
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర' షూటింగు దశలో ఉంది. ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతి నాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. మూడో షెడ్యూల్ షూటింగుకి టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో జాలరుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా జాన్వీ కపూర్ కనిపించనుందనే టాక్ వచ్చింది. కానీ ఆమె పాత్ర విలన్ ఫ్యామిలీ నేపథ్యానికి లింకై ఉంటుందనే విషయం తాజాగా బయటికి వచ్చింది. ఆమె పాత్రకి సంబంధించిన ఒక ట్విస్ట్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ చివరివరకూ లాక్ చేసి ఉంచుతుందని చెబుతున్నారు. ప్రధానమైన కథతో పాటు ఆమె పాత్రకి సంబంధించిన సస్పెన్స్ కూడా కొనసాగుతూ ఉంటుందని అంటున్నారు. ఆ ట్విస్ట్  ను ఎవరూ గెస్ చేయలేరనీ .. రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ షాక్ అవుతారని చెబుతున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
Advertisement
Ntr
Janhvi Kapoor
Devara Movie

More Telugu News